ముంబై: భారత్ క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లి శకం నడుస్తోంది. అటు కెప్టెన్ గానూ, ఇటు బ్యాట్స్ మన్ గానూ ఘన విజయాలు అందుకుంటూ అత్యుత్తమ దశలో ఉన్నాడు కోహ్లి. దేశంలో ఇప్పుడు ఎక్కువమంది అభిమానించే క్రికెటర్ కోహ్లినే. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో సచిన్ కంటే కూడా కోహ్లినే అత్యుత్తమ క్రికెటర్ అని దిగ్గజ క్రికెటర్లు ప్రశంసించారు కూడా.
కాగా, బ్రియాన్ లారా మాత్రం కోహ్లి కంటే సచిన్ టెండూల్కరే మేటి అంటూ కొనియాడాడు. నీరుల్‌లోని డీవై పాటిల్ యూనివర్శిటీలో జరిగిన డాక్టరేట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన లారాకు విద్యార్థులు అడిగిన ఒక ప్రశ్నకుసచినే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అంటూ బదులిచ్చాడు .క్రికెట్ గేమ్‌పై సచిన్ ఒక చెరగని ముద్ర వేశాడన్నాడు. ‘సచిన్ ఆడిన కాలంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. భారత ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై ఆడలేరనే అపవాదు ఉండేదో దాన్ని సచిన్ చెరిపేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఉన్న ప్రతీ పిచ్‌పై సచిన్ మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాని కొనసాగింపే ప్రస్తుత భారత క్రికెటర్లు ప‍్రతీ చోట రాణించడానికి కారణం. సచిన్ అనే పుస్తకంలో ఒక పేజీ మాత్రమే మిగతా క్రికెటర్లు’ అని లారా కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment