టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2022 సీజన్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సిరాజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ మీడియా సమావేశంలో గురువారం వెల్లడించింది.
"కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్‌లోని అఖరి మూడు మ్యాచ్‌లకు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఒప్పందం చేసుకున్నాము. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 12న సోమర్‌సెట్‌తో మ్యాచ్‌కు సిరాజ్ జట్టుతో కలవనున్నాడు" అని వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఇదే విషయం పై సిరాజ్ మాట్లాడుతూ.. :"కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఆనుమతి ఇచ్చిన బీసీసీఐకు కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నాను.
వార్విక్‌షైర్ వంటి ప్రతిష్టాత్మక క్లబ్‌లో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఆడడానన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. వార్విక్‌షైర్ జట్టులో చేరేందుకు చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ గడ్డపై సిరాజ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ ఐదో టెస్టులో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs ZIM: వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన!
Comments
Please login to add a commentAdd a comment