Domestic one-day tournament
-
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్.. 5 వికెట్లు, 0 పరుగులు.. మొత్తంగా 7 వికెట్లు
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ రాయల్ లండన్ వన్డే కప్-2023లో హ్యాంప్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వార్విక్షైర్తో ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళే జరుగుతున్న మరో సెమీఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్-లీసెస్టర్‌షైర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 16న జరిగే ఫైనల్లో హ్యాంప్‌షైర్‌తో తలపడుతుంది. చెలరేగిన లియామ్ డాసన్.. వార్విక్షైర్తో జరిగిన తొలి సెమీఫైనల్లో హ్యాంప్‌షైర్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ చెలరేగిపోయాడు. డాసన్ తన స్పిన్ మాయాజాలంతో వార్విక్షైర్ను కుప్పకూల్చాడు. డాసన్ తాను వేసిన తొలి 10 బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతను 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి, హ్యాంప్‌షైర్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. డాసన్ మాయాజాలం దెబ్బకు 25.5 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది. డాసన్ 6.5 ఓవర్లు బౌల్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనికి పేసర్ కీత్ బార్కర్ (7-1-28-3) తోడవ్వడంతో వార్విక్షైర్ కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయింది.వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో బర్నార్డ్ (26), సామ్ హెయిన్ (33 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. వీరితో ముగ్గురిని డాసన్ ఔట్ చేశాడు. రాణించిన మిడిల్టన్.. 94 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 19.1 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరుకుంది. ఓపెనర్ ఫ్లెచా మిడిల్టన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించగా.. టామ్ ప్రెస్ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ నిక్ గబ్బన్స్ 9 పరుగులు చేసి లింటాట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హ్యాంప్‌షైర్ గిబ్బన్స్ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, 33 లియామ్ ఏళ్ల డాసన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 6 వన్డేలు, 11 టీ20లు ఆడి 18 వికెట్లు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. -
సెమీస్‌లో బెంగాల్, ఒడిశా
విజయ్ హజారే ట్రోఫీ రాజ్‌కోట్: దేశవాళీ వన్డే టోర్నీ (విజయ్ హజారే ట్రోఫీ)లో బెంగాల్, ఒడిశా జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో బెంగాల్ 17 పరుగుల తేడాతో విదర్భను... ఒడిషా పరుగు తేడాతో గోవాను ఓడించాయి. విదర్భతో జరిగిన తొలి క్వార్టర్స్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. మనోజ్ తివారి (101 బంతుల్లో 130; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, శ్రీవత్స్ గోస్వామి (84) రాణించాడు. అనంతరం విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లకు 301 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైజ్ ఫజల్ (111 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బద్రీనాథ్ (94 బంతుల్లో 100; 13 ఫోర్లు) శతకాలు చేసినా లాభం లేకపోయింది. మరో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా 49.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. అనురాగ్ సారంగి (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్), బిప్లబ్ సమంత్రే (73 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. ఆ తర్వాత గోవా 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగులు చేసింది. అమోఘ్ దేశాయ్ (139 బంతుల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా, షగున్ కామత్ (92 నాటౌట్) ఆ అవకాశం కోల్పోయాడు.