ఫామ్ లేమితో సతమతవుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి తన కెరీర్‌లో మొదటిసారిగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కౌంటీల్లో ఆడేందుకు విరాట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అక్కడ పరిస్థితులకు అలావాటు పడేందుకు ముందుగానే కోహ్లి ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కౌంటీల్లో కోహ్లి భాగం కానున్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లికి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
ఒకే ఒక సెంచరీ..
కాగా కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లి
కోహ్లి 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ కోహ్లి మాత్రం తన రిథమ్‌ను తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అంతకుతోడు భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రతీ ఒక్క ప్లేయరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా టెస్టు జట్టులో ప్లేయర్లందరూ వీలైతే కచ్చితంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడాలని సూచించాడు.
ఈ క్రమంలోనే కోహ్లి 13 ఏళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. అతడు చివరగా 2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా చేజార్చుకుంది. బీజీటీ సిరీస్ భారత్ కోల్పోవడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
Comments
Please login to add a commentAdd a comment