ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో కీలక పోరు సిదమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కింగ్ కోహ్లి ఆడనున్నాడు.
తొలుత ఈ సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండాలని భావించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడితో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. ఫిబ్రవరి 6న రాజ్‌కోట్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే మొదటి వన్డేకు ముందు విరాట్ కోహ్లిని ఓ అరుదైన ఫీట్ ఊరిస్తోంది.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లి..
రాజ్‌కోట్ వన్డేలో కోహ్లి మరో 96 పరుగులు సాధిస్తే.. వన్డే క్రికెట్‌లో 300 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 14000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. వన్డేల్లో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 మార్క్‌ను అధిగమించారు.
ఈ మైలు రాయిని అందుకోవడానికి సచిన్ 350 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. మరోవైపు కోహ్లి 295 మ్యాచ్‌ల్లో 13906 పరుగులు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి ఈ ఘనత సాధించడం ఖాయమన్పిస్తోంది.
ఆస్ట్రేలియాలో ఫెయిల్..
కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇంగ్లీష్ జట్టుతో వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)
ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)
మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)
Comments
Please login to add a commentAdd a comment