PC:BCCI
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందకు సిద్దమయ్యాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2022లో గ్లామోర్గాన్ తరపున గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు గిల్‌కు ఇంకా వీసా మంజూ కాలేదు.
అయితే, వీసా సమస్య క్లియర్ అయిన వెంటనే గిల్ ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ దుమ్ము రేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 245 పరుగులు సాధించాడు. మూడో వన్డేలో కెరీర్‌లోనే తొలి శతకం నమోదు చేసి సత్తా చాటాడు.
ఆరో భారత ఆటగాడిగా!
ఒకవేళ గిల్ ఇంగ్లండ్‌కు పయనమైనట్లైతే.. ప్రస్తుత సీజన్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఛతేశ్వర్ పుజారా (ససెక్స్), వాషింగ్టన్ సుందర్ (లంకాషైర్), మహ్మద్ సిరాజ్ (వార్విక్‌షైర్), ఉమేష్ యాదవ్ (మిడిల్‌సెక్స్), నవదీప్ సైనీ (కెంట్) ఆయా జట్లకు ప్రాతినిద్యం వహిస్తున్నారు.
ఇక ఇంగ్లండ్ కౌంటీల్లో గ్లామోర్గాన్ జట్టుకు ఆడే మూడో భారత ఆటగాడిగా గిల్ నిలిచే అవకాశం ఉంది. అంతకుముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (1987-91) కాలంలో గ్లామోర్గాన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2005లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2005లో ఇదే క్లబ్ తరపున ఆడాడు.
చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment