కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చహల్ ఈ ఫీట్‌ను సాధించాడు. చహల్‌తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్‌సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో రీస్ (50), మాడ్‌సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌
Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024
అంతకుముందు నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్‌సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షా
ఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్‌షైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్
చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున తన తొలి మ్యాచ్‌లో కెంట్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. ఆ మ్యాచ్‌లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్‌పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment