
విశాఖ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ రెండు వరుస శతకాలతో రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా దిగిన తొలి టెస్టులోనే రెండు సెంచరీ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే మ్యాచ్‌లో సహచర ఆటగాడు చతేశ్వర పుజారాపై అసభ్య పదజాలంతో దూషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే క్రమంలో రోహిత్ సింగిల్‌కు రమ్మంటూ పిలిచాడు. అయితే దానికి పుజారా నుంచి సరైన స్పందన లేకపోవడంతో రోహిత్ తిట్ల దండకం అందుకున్నాడట.
నిరర్దకమైన పదజాలం వాడినట్లు స్ట్రైకింగ్ ఎండ్‌లో మైక్‌లో రికార్డయ్యింది. ఇది తాజాగా వెలుగు చూడటం అంతలోనే వైరల్ కావడం జరిగింది. అయితే పుజారాను రోహిత్ తిట్టిన దాన్ని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ట్వీటర్‌లో తనదైన శైలిలో చమత్కరించాడు. ‘ ఈసారి రోహిత్ సమయం.. విరాట్‌ది కాదు. ఆ తిట్టు ఏంటో నీకు తెలుసా..? తెలిసే ఉంటుందిలే అంటూ ఎద్దేవా చేశాడు. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరిగిన సమయంలో కోహ్లి ఇలానే దూషించడాన్ని స్టోక్స్ పరోక్షంగా గుర్తు చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రోహిత్‌ను సమర్ధిస్తే, మరికొంతమంది పుజారాను వెనకేసుకొస్తున్నారు. కాగా, బెన్ స్టోక్స్ ట్వీట్ చేయడంపై హర్భజన్ సింగ్ స్మైలీ ఎమోజీలతో స‍్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment