Cheteshwar Pujara Worst Record No Century From 38 Innings In Tests.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ పుజారా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి సెంచరీ సాధిస్తానని చెప్పిన పుజారా కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేక తన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది!
టీమిండియా తరపున బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చే పుజారా 2019లో ఆసీస్ పర్యటనలో ఆఖరిసారి సెంచరీ(193 పరుగులు) కొట్టాడు. అప్పటినుంచి 39 ఇన్నింగ్స్‌లుగా(కివీస్‌తో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లు కలుపుకొని) ఒక్క సెంచరీ చేయలేదు. తద్వారా ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంతకముందు టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ వాడేకర్ టెస్టుల్లో మూడో స్థానంలో వచ్చి 39 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ సాధించలేకపోయాడు. తాజాగా ఆ చెత్త రికార్డును పుజారా సమం చేశాడు.
చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే
ఇక అభిమానులు కూడా పుజారా ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న రహానే ట్రోల్ అయ్యాడు.. ఇప్పుడు పుజారా వంతు వచ్చింది. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో పుజారాపై వేటు పడడం ఖాయం.. రహానే, పుజారాలిద్దరిని తొలగించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment