Ajit wadekar
-
మాట నిలబెట్టుకోలేదు.. అజిత్ వాడేకర్ చెత్త రికార్డు సమం
Cheteshwar Pujara Worst Record No Century From 38 Innings In Tests.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ పుజారా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి సెంచరీ సాధిస్తానని చెప్పిన పుజారా కనీసం అర్థ సెంచరీ కూడా చేయలేక తన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది! టీమిండియా తరపున బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వచ్చే పుజారా 2019లో ఆసీస్ పర్యటనలో ఆఖరిసారి సెంచరీ(193 పరుగులు) కొట్టాడు. అప్పటినుంచి 39 ఇన్నింగ్స్‌లుగా(కివీస్‌తో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లు కలుపుకొని) ఒక్క సెంచరీ చేయలేదు. తద్వారా ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంతకముందు టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ వాడేకర్ టెస్టుల్లో మూడో స్థానంలో వచ్చి 39 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ సాధించలేకపోయాడు. తాజాగా ఆ చెత్త రికార్డును పుజారా సమం చేశాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే ఇక అభిమానులు కూడా పుజారా ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న రహానే ట్రోల్ అయ్యాడు.. ఇప్పుడు పుజారా వంతు వచ్చింది. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టులో పుజారాపై వేటు పడడం ఖాయం.. రహానే, పుజారాలిద్దరిని తొలగించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు. -
భారత్ క్రికెట్‌కు గొప్ప సేవకుడు..
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ వాడేకర్ (77) బుధవారం కన్నుమూశారు. అజిత్ వాడేకర్ మృతి పట్ల రాష్ట్రపతితో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమైన వార్త అని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన గొప్ప ఆటగాళ్లలో వాడేకర్ ఒకరని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. క్రికెటర్, కెప్టెన్, కోచ్, మేనేజర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా సేవలందించిన వాడేకర్ చాలా అరుదైన వ్యక్తిగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు వాడేకర్ సర్ అని కొనియాడాడు. ‘ఓం శాంతి అజిత్ వాడేకర్ సర్’ అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. భారత్‌కు చారిత్రక విజయాలు అందించిన మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ఇక లేరన్న వార్త తనను ఎంతగానో కలచి వేసిందంటూ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు రైనా సంతాపం తెలియజేశారు. అజిత్ వాడేకర్ కన్నుమూత -
అజిత్ వాడేకర్ కన్నుమూత
-
అజిత్ వాడేకర్ కన్నుమూత
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. వాడేకర్... 1941 ఏప్రిల్ 1న నాటి బొంబాయిలో జన్మించారు. 1958లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడారు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేశారు. 1974లో రిటైరయ్యారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన వాడేకర్ మూడో స్థానంలో దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్. భారత్ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్ సభ్యుడు కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో 67 పరుగులతో రాణించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. విదేశీ విజయ సారథి... : గావస్కర్, విశ్వనాథ్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్, బేడి, ప్రసన్న, వెంకట్రాఘన్, చంద్రశేఖర్ వంటి దిగ్గజ స్పిన్నర్లున్న జట్టుకు వాడేకర్ సారథ్యం వహించారు. భారత్ ఆయన కెప్టెన్సీలోనే 1971లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా టెస్టు సిరీస్‌లను గెలిచింది. 1972–73లో స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించింది. వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గడంతో సారథిగా వాడేకర్ పేరు మార్మోగిపోయింది. అయితే, 1974లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం 1990ల్లో అజహరుద్దీన్ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్ కమ్ కోచ్‌గా వ్యవహరించారు. 1998–99 మధ్యకాలంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు. 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పుర స్కారం పొందారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. వాడేకర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. -
'ప్రాక్టీస్ మ్యాచ్ ఉండాల్సింది'
ముంబై: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోతున్న భారత జట్టుకు అక్కడ కనీసం ఒక్క ప్రాక్టీస్ కూడా లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ తప్పుబట్టాడు. స్వదేశంలో వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న టీమిండియా.. సఫారీ పిచ్‌లపై ఎటువంటి వార్మప్ గేమ్ లేకుండా నేరుగా బరిలోకి దిగడం అంత మంచి పరిణామం కాదన్నాడు. మన జట్టు చక్కటి సమతుల్యంతో ఉన్నప్పటికీ.. ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేకుండా సఫారీలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం కావడం మన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నాడు. 'ప్రస్తుతం టీమిండియా మంచి జోరు మీద ఉంది. అందుకు కారణం జట్టులో ఉన్న సమతుల్యంతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటమే. అటు బౌలింగ్ విభాగం కూడా చాలా బాగుంది. ప్రధానంగా భారత పేసర్లు ఫామ్‌లో ఉన్నారు. ఏ పిచ్‌లపైనైనా వికెట్లు సాధించే సత్తా మన పేసర్లకు ఉంది. కాకపోతే దక్షిణాఫ్రికాలో ఏ జట్టుకైనా కష్టాలు తప్పవనేది గత రికార్డులు చెబుతున్నాయి. అందులోనే దక్షిణాఫ్రికా ఒక కఠినమైన ప్రత్యర్థి. టీమిండియా తగిన ప్రణాళికతో ఆడితేనే అక్కడ గెలుపును సొంతం చేసుకుంటుంది. సఫారీ పర్యటనలో భారత్ జట్టు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోరుకు సిద్దం కావడం అంత మంచి పరిణామం కాదు' అని వాడేకర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో చివరి టీ 20 మ్యాచ్ ఆడిన రెండు రోజులకు భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్దం కానుంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్‌తో పాటు ఆరు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్‌లలో టీమిండియా తలపడనుంది. జనవరి 5 తేదీ నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. -
టీమిండియా కోచ్ గా అతనే సరైన వ్యక్తి..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తి అంటున్నాడు మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్. భారత్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లేనే తాను ఇప్పటికీ సూచిస్తానని, అయితే అతను రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సెహ్వాగ్ ను ఎంపిక చేస్తే బాగుంటుందన్నాడు. ఏడాది కాలంగా భారత జట్టు ఘన విజయాల్లో పాలుపంచుకున్న కుంబ్లే స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి సెహ్వాగ్ అని వాడేకర్ తెలిపాడు. 'నేనింకా అనిల్ కుంబ్లే పేరునే కోచ్ పదవికి ప్రిఫర్ చేస్తా. ఏడాది కాలంలో భారత విజయాల్ని చూస్తే కుంబ్లేను ఎవరూ కాదనరు. మనమంతా కుంబ్లే సముచిత గౌరవం ఇవ్వాలి. అయితే కుంబ్లే వైదొలిగిన నేపథ్యంలో కుంబ్లే వారసుడిగా సెహ్వాగ్ పేరును నేను సూచిస్తా. కుంబ్లే స్థానాన్ని సెహ్వాగ్ భర్తీ చేయగలడు. భారత క్రికెట్ జట్టుకు తాను కోచ్ గా పని చేసిన కాలంలో కుంబ్లే జట్టులో ఉన్న విషయాన్ని వాడేకర్ గుర్తు చేసుకున్నాడు. కుంబ్లే చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి అని, ఎంతో హుందాగా ఉండేవాడని వాడేకర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతనికి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి అని, ఎప్పుడూ విజయమే లక్ష్యంగా తన ప్రణాళికల్ని రూపొందించుకునే వాడని ఆనాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. -
ఓటమి ఓ మజిలీ
మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పుడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. మొన్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తో ఆడి చిత్తుగా ఓడిపోయింది. అంతకు ముందు అవిచ్ఛి న్నంగా ఏడుసార్లు గెలిచింది. అయినా దేశంలో టీవీలు బద్ద లుకొట్టారు. ప్రదర్శనలు చేశా రు. ధోనీ సామర్థ్యం మీదా, టీమ్ అసమర్థత మీదా, కోహ్లీ శృంగారం మీదా దుమ్మెత్తి పోశారు. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ, తుమ్ముకి తమ్ము డు లేడని నానుడి. విజయాన్ని నెత్తిన వేసుకుని గెంతులు వేసేవారు బోలెడుమంది ఉంటారు గానీ, ఓటమిని అర్థం చేసుకుని ఓదార్చేవారు ఒక్కరూ కనిపించరు. అం దుకే ఒకాయన అన్నాడు: ‘అపజయం కారణంగా నిశ్చే ష్టుడిని చేసే నిశ్శబ్దం విజయాన్ని చూసి విరగబడే వెర్రి నినాదాల కంటే పెద్ద పాఠం నేర్పుతుంది’ అని. ఇంగ్లిష్‌లో చెబితే ఇంకా రుచిగా ఉంటుంది- stunning silence of a defeat has taught me more than the rejoicing noise of a success. క్రికెట్ అన్నది క్రీడ అని గుర్తుంచుకుంటే రెండేళ్ల క్రితం భారతదేశం బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయిన విష యం గుర్తుకురావాలి. 1971లో అజిత్ వాడేకర్ భారత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ దేశాలతో ఆయా దేశాలలో ఆడి ఘనమైన విజయాన్ని సాధించింది. ముంబైలో అజిత్ వాడేకర్కీ, ఆయన టీమ్కీ ఘనమైన స్వాగతాన్ని ఇస్తూ మోటార్ కార్లతో ఊరేగించారు. మరో మూడేళ్ల తరువాత - 1974లో అదే టీమ్ అదే కెప్టెన్‌తో ఇంగ్లండ్‌లో పర్యటించింది. అప్పు డు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈసారి క్రికెట్ అభిమానులు అజిత్ వాడేకర్ ఇంటి మీద చెప్పులతో, రాళ్లతో వర్షాన్ని కురిపించారు. విజయాన్ని పంచుకోవడం ‘దొమ్మీ’ ఆవేశం. అపజయానికి సాను భూతి ‘పరిణతి’కి సంకేతం. రెండు ఉదాహరణలు: 1962లో జరిగిన సంఘటన ఇది. నేనప్పుడు ఒకానొక దినపత్రికలో పనిచేస్తున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్యకేంద్రం డాక్టరు ఈశ్వరమా ర్తాండ శాస్త్రిగారు. గొప్ప వ్యక్తి. చండశాసనుడు. మిలట రీలో పనిచేసి వచ్చారు. మాట కటువు. కాని మనసు వెన్న. నాకూ ఆయనకీ తేలికగా 30 సంవత్సరాల దూ రం. అయినా మేమిద్దరం మిత్రులమయ్యాం. ఆయన డ్యూటీలో లేనప్పుడు ఒక విద్యార్థి ఏదో బాధతో అసు పత్రిలో చేరాడు. మందులిచ్చారు. పరిస్థితి అర్థమయ్యే లోగా ఆ కుర్రాడు కన్నుమూశాడు. దానికి శాస్త్రిగారి బాధ్యత బొత్తిగా లేదు. తీరా ఆ కుర్రాడు హాస్టల్లో ఉన్న వాడు కాదు. సరే. డాక్టర్ని బర్తరఫ్ చెయ్యాలని కొందరు విద్యార్థులు పెద్ద అల్లరి చేశారు. అప్పటి వైస్‌చాన్సలర్ ఏఎల్ నారాయణగారు. నిజాయితీపరుడూ, ముక్కుకు సూటిగా పోయే శాస్త్రి గారి మనసు గాయపడింది. వైస్ చాన్సలర్ నిర్ణయానికి ముందే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయనకి జరిగిన అన్యాయాన్ని గురించి ఆ రోజుల్లో హిందూ పత్రిక సంపాదకీయం రాసింది. నేనప్పుడు చిత్తూరులో పనిచేస్తున్నాను. విష యం తెలుసుకుని బాధపడి విశాఖపట్నం వస్తూనే ఆయ న్ని చూడడానికి వెళ్లాను. గొంతు ఆవేశంతో పూడుకు పోగా ఒకమాట అన్నారు: ‘మారుతీరావుగారూ! మీరు వచ్చి పలకరించకపోతే నేను చాలా బాధపడేవాడిని’ అంటూ జర్మనీ నుంచి ఒక మిత్రుడు రాసిన ఓదార్పు ఉత్తరాన్ని చదివారు. ‘డియర్ మార్టిన్! (మార్తాండశాస్త్రి ని అలా పిలిచేవారు) సంవత్సరాల క్రిందట ఓ మహా త్ముడిని అన్యాయంగా సిలువ ఎక్కించారు. మానవ స్వభావం అప్పటికీ ఇప్పటికీ మారలేదని మీకు జరిగిన అన్యాయం రుజువు చేస్తోంది.’ కష్టంలో ఉపశమనం ప్రాణవాయువు. అపజయంలో అండగా నిలిచిన గొప్ప ఉదాహ రణ. మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయారు. దారుణంగా పరాభవం పాలయ్యారు. కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు. అప్పుడు ఏకఛత్రాధిపతి సుయో ధనుడు. అయినా ధర్మం అడవుల పాలైంది. రుషులు ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుని సందర్శించి గాయపడిన మనస్సుకీ, జరిగిన అన్యాయానికీ, జరిగిన అనర్థానికీ అనునయంగా -గతంలో అంతకన్నా ధర్మానికి నిలబడి కష్టాలపాలయిన హరిశ్చంద్రుడు, నల మహారాజు వం టివారి చరిత్రలను ఉటంకించి వారిని సముదాయిం చారు. అది పరిణతికి పరాకాష్ట. సమాజంలో మేధావి కష్టంలో అండగా నిలవడం రుషిత్వం-అన్నది పురాణం. విజయం మన అహంకారాన్ని రెచ్చగొడుతుంది. అపజయం-నిజమైన హితులెవరో తేల్చి చెప్తుంది. చైనాలో ఒక సామెత ఉంది. పెద్దలు దుమ్ము పడిన ముఖాన్ని కడుక్కుని శుభ్రంగా ఉందో లేదో అద్దాన్ని చూస్తారు. కాని పసివాడు ముఖాన్ని తుడుచుకున్న తువాలును చూస్తాడు. క్రికెట్లో ఓటమి బాధాకరమే- దేశంలో అందరికీ. కాని ఆ విజయాన్నీ, ఓటమినీ ఆనాటి తమ ప్రయత్నంతో మాత్రమే కాక, ఆనాటి ఎదుటి టీమ్ సామర్థ్యానికీ చోటు కల్పించే అభిమాని విచక్షణ- ఆటగాడి అద్భుతమైన కవచం. - గొల్లపూడి మారుతీరావు