ప్యాట్ కమిన్స్(ఫైల్‌ఫొటో)
సిడ్నీ: ఐపీఎల్ -13వ సీజన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు ఉండగా, రూ. 15.50 కోట్లు వెచ్చించీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంచితే, భారత స్పెషలిస్టు టెస్టు ప్లేయర్‌గా ముద్ర సంపాదించుకున్న చతేశ్వర పుజారా.. ఐపీఎల్ ఆడి దాదాపు ఆరేళ్ల అవుతుంది. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..!)
2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఓపెనర్‌గా దిగిన పుజారా మళ్లీ ఆ లీగ్‌లో కనిపించలేదు. అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో పుజారాను వేలంలో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వేలంలో పదే పదే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా ఏ ఫ్రాంచైజీ కూడా కనీస ధర కూడా తీసుకోవడం లేదు. తాను మూడు ఫార్మాట్లకు సరిపోయే క్రికెటర్‌నని పుజారా చెప్పుకుంటున్నా అతన్ని కొనుగోలు చేయడం లేదు.
అయితే టెస్టుల్లో ప్రపంచ నంబర్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్.. పుజారాకు బౌలింగ్ చేయడమే కష్టమంటున్నాడు. భారత జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లునప్పటికీ పుజారాకు బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిందని వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది అనే ప్రశ్నకు తడుముకోకుండా పుజారా అని సమాధానమిచ్చాడు కమిన్స్. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌కు కమిన్స్ పలు ప్రశ్నలకు బదులిచ్చాడు. దీనిలో భాగంగా ‘మీకు ఎదురైన అత్యుత్తమ భారత టెస్టు ఆటగాడు’ ఎవరు అంటే పుజారా అని చెప్పుకొచ్చాడు.(అత్యధిక ధర ఆటగాడి ఎదురుచూపులు..!)
‘ పుజారా ఒక అసాధారణ ఆటగాడు. 2018-19 సీజన్‌లో జరిగిన సిరీస్‌లో పుజరా కీలక పాత్ర పోషించాడు. నాకు సవాల్‌గా నిలిచిన భారత ఆటగాడు పుజారా. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అసలు ఏ బంతులు వేయాలో అర్థమయ్యేది కాదు. రోజు-రోజుకీ కఠినంగా మారిపోయేవాడు పుజారా’ అని కమిన్స్ తెలిపాడు. ఆ సీజన్ టెస్టు సిరీస్‌లో పుజారా నాలుగు టెస్టు మ్యాచ్‌లు(ఏడు ఇన్నింగ్స్‌ల్లో) 521 పరుగులు సాధించి భారత్ టెస్టు సిరీస్‌ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో పుజరా అత్యధిక వ్యక్తిగత స్కోరు 193 కాగా మూడు సెంచరీలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment