PC:BCCI twitter
ఆసియాకప్-2022లో దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం సాయంత్రం భారత్-పాక్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలవన్‌ను భారత వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఎంపిక చేశాడు. అతడు ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ రాహుల్‌ను ఎంచుకున్నాడు.
మూడు నాలుగు స్థానాల్లో వరుసగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాను పుజారా ఎంపిక చేశాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది.
ఇక తన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్‌కు భారత టెస్టు స్పెషలిస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి దుమ్ము రేపుతున్న వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను పుజారా ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరో వైపు వెటరన్ స్సిన్నర్ రవి అశ్విన్‌కు కూడా పుజారా ప్రకటించిన జట్టులో చోటు దక్క లేదు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు పుజారా ఎంచకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: Ind Vs Pak- Virat Kohli: నాడు ఓపెనర్లు డకౌట్... మిగతా వాళ్లంతా విఫలం.. కోహ్లి ఒక్కడే! ఇప్పుడు కూడా!
Comments
Please login to add a commentAdd a comment