ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠత పోరులో భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 7 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. నవాజ్ వేసిన తొలి బంతికే మంచి ఊపులో ఉన్న జడేజా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ సింగల్ తీసి హార్దిక్ స్ట్రైక్ ఇచ్చాడు. అయితే మూడో బంతిని హార్దిక్ కవర్స్ లోకి ఆడగా.. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. ఈ సమయంలో కార్తీక్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. హార్దిక్ మాత్రం వద్దంటూ వారించాడు. "కూల్‌గా ఉండు కార్తీక్ భాయ్, నేను ఫినిష్ చేస్తా" అంటూ సైగలు చేశాడు. మాట నిలబెట్టుకున్న హార్దిక్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్ తమ రెండో మ్యాచ్‌లో బుధవారం(ఆగస్టు 31) హాంకాంగ్‌తో తలపడనుంది.
Positive Thinking:
— TRS Scared of BJP (@RameshM_FTFGC) August 28, 2022
I know the Bowler has lot of Pressure on Bowling last over.
This Gives you #Confidence & #Win#IndiaWon #IndiaVsPak #INDvsPAK #Asiacup2022
Congratulations #TeamIndia
Amazing batting by @hardikpandya7 @imjadeja
Marvelous Tremendous Fabulous
Unbelievable pic.twitter.com/aQa78QwM9D
HARDIK REDEMPTION PANDYA 💙💙💙💙💙💙 COMEBACK HERO FINISHES OFF IN STYLE😍😍😍😍 #INDvsPAK #kungfupandya #IndianCricketTeam #indiancricket pic.twitter.com/PtrSsiI6rL
— Jehan Dhabhar (@Dhabhar24Jehan) August 28, 2022
The pressure of a last over chase in an 🇮🇳 vs 🇵🇰 match.
— North Stand Gang - Wankhede (@NorthStandGang) August 29, 2022
A crisp shot played straight to the fielder resulting in a dot ball.
6 to win from 3 deliveries
A simple yet positive nod to his partner, @DineshKarthik.
The pure magic of @hardikpandya7 for us. ❤️pic.twitter.com/Wnn9c7UN6l
చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం
Comments
Please login to add a commentAdd a comment