BGT 2023: Cheteshwar Pujara Hits Sixer-Rohit Sharma Smiles Viral - Sakshi
Sakshi News home page

IND Vs AUS: పుజారా సిక్సర్‌.. నవ్విన రోహిత్‌

Mar 2 2023 4:54 PM | Updated on Mar 2 2023 5:23 PM

BGT 2023: Cheteshwar Pujara Hits Sixer-Rohit Sharma Smiles Viral - Sakshi

ఇండోర్‌ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా పరిస్థితి చూస్తుంటే ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఒంటరి పోరాటం చేసిన పుజారా(59 పరుగులు) కూడా ఔటవ్వడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం 67 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉంది. అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నుంచి బయటపడడం కష్టమే. అయితే రెండోరోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. 

అప్పటికే టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయింది. పుజారా 52, అక్షర్‌ పటేల్‌ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు. బంతి అనూహ్యమైన టర్న్‌ తీసుకుంటుండడంతో బ్యాటింగ్‌ ఆడడం కష్టంగా మారింది. ఈ సమయంలో అక్షర్‌ పటేల్‌ రక్షణాత్మక ధోరణిలో ఆడడం కెప్టెన్‌ రోహిత్‌కు నచ్చలేదు. పక్కనే ఉన్న ఇషాన్‌ కిషన్‌ను పిలిచి అక్షర్‌ను చూపిస్తూ భారీ సిక్సర్‌ కొడితే బాగుండు అని చెప్పాడు. మరి రోహిత్‌ సందేశం పుజారా చెవిన పడిందేమో తెలియదు కానీ మరుసటి బంతినే పుజారా మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. ఇది చూసిన రోహిత్‌ చిన్నగా నవ్వి..'' యస్‌'' అంటూ ఎక్స్‌‍ప్రెషన్‌ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement