ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విషయం పక్కన పెడితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా కోసం రోహిత్ తన వికెట్‌ను త్యాగం చేశాడు.
టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కుహ్నెమన్ బౌలింగ్‌లో.. పుల్ టాస్ బంతిని రోహిత్ స్క్వేర్ ఆన్ సైడ్ ఆడాడు. అయితే తొలి పరుగును వీరిద్దరూ వేగంగా పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పరుగు కోసం నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి రోహిత్ "నో" అని కాల్ ఇచ్చినప్పటికీ.. పూజారా మాత్రం పరిగెత్తూకుంటూ ముందుకు వచ్చేశాడు.
ఈ క్రమంలో రోహిత్ తన మనసు మార్చుకుని వెనుక్కి వెళ్లకుండా వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. అంతలోనే ఆసీస్ ఫీల్డర్ హ్యాండ్‌కాంబ్ బంతిని వికెట్ కీపర్ చేతి క్యారీకి చేతికి ఇచ్చాడు. దీంతో క్యారీ బెయిల్స్‌ను పడగొట్టడంతో రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఇక తన వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్ శర్మపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రోహిత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు.
— MINI BUS 2022 (@minibus2022) February 19, 2023
చదవండి: IND vs AUS: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. 31 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
Comments
Please login to add a commentAdd a comment