ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శల వర్షం కురిపించాడు. చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా బౌల్డయ్యాడు. అంతకుముందు అదే రీతిలో బోలాండ్ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు.
"పుజారా లాంటి సీనియర్ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు.
అందుకు తగ్గ ప్రతిఫలం అనువభవించాడు. ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్ స్టంప్‌పైనే ఉండిపోయింది. కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు.
ఇంగ్లండ్ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజరాకు ఏమైంది" అని కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్ ఉందా? కనీసం డ్రా అయినా
Comments
Please login to add a commentAdd a comment