
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగుల బ్యాటింగ్ ఊచకోత మొదలైంది. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ముగ్గురు రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్ దృవ్ జురెల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ద శతకంతో బీభత్సం సృష్టించాడు.
రాజస్థాన్ రాయల్స్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఆడిన మ్యాచ్‌లో తొలుత రియాన్ పరాగ్ శతకొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆతర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురిలో రియాన్ పరాగ్ విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది.
144* (64) - What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025
రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీర బాదుడును ముగించుకుని పెవిలియన్‌కు వెళ్తుండగా సహచరులు సంజూ, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజూ 'వెల్ డన్ మచ్చా..నైస్ హిట్టింగ్' అనగా.. జైస్వాల్, జురెల్ 'వాట్ ఎ రియాన్' అంటూ అభినందించారు. సహచరులు రియాన్‌ను అభినందిస్తున్న వీడియో రాయల్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
కాగా, ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. ఈ సీజన్‌లో రాయల్స్, సన్‌రైజర్స్ జట్లు బ్యాటింగ్ విస్పోటాలు కలిగి ఉన్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. బౌలర్లను ఊచకోత కోయడంలో ఈ ఇరు జట్ల మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చెప్పలేం.
సన్‌రైజర్స్‌లో ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర యోధులు ఉండగా.. రాయల్స్‌లో రియాన్ పరాగ్, దృవ్ జురెల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, హెట్‌మైర్ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
రాజస్థాన్ రాయల్స్..
సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment