
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. నిన్న (మార్చి 19) జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీ (41 బంతుల్లో 85 పరుగులు) విరుచుకుపడ్డాడు. పంజాబ్ కింగ్స్ టీమ్-ఏ, టీమ్-బిగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. టీమ్-బి శ్రేయస్ అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగించాడు. అనంతరం ఛేదనలో టీమ్-ఏ కూడా పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఆర్య 72, ప్రభ్‌సిమ్రన్ 66 పరుగులు చేసి ఔటైన అనంతరం టీమ్-ఏ కష్టాల్లో పడింది.
ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో టీమ్-ఏ నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా శ్రేయస్ టీమ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్-ఏ ఓడిపోయినా ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఫామ్‌లోకి రావడం పంజాబ్ కింగ్స్‌కు శుభసూచకం. ఈ ఇద్దరే రానున్న సీజన్‌లో పంజాబ్ ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తారు.
ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. శ్రేయస్ టీమ్‌లో భాగమైన అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్‌కు ఇది కూడా శుభసూచకమే. మొత్తంగా ముగ్గురు బ్యాటర్లు, ఓ బౌలర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫామ్‌ను ప్రదర్శించడం పంజాబ్ కింగ్స్‌కు తమ తొలి మ్యాచ్ ముందు మంచి బూస్టప్‌ను ఇస్తుంది.
ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈసారి పంజాబ్ కింగ్స్ గతంలో ఎప్పుడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే ఎంతటి బౌలర్లైనా ఉలిక్కి పడాల్సిందే.
శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జన్సెన్ రూపంలో ఆ జట్టులో డైనమైట్లు ఉన్నారు. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు.
తొలి మ్యాచ్‌తో పంజాబ్ ఎదుర్కోబోయే గుజరాత్ ఈ సీజన్‌లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది.
రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగంలో చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.
పంజాబ్ కింగ్స్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్‌లెట్
గుజరాత్ టైటాన్స్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment