Ind Vs Eng 2022: Cheteshwar Pujara Opens Up About His Team India Comeback - Sakshi
Sakshi News home page

Ind Vs Eng 5th Test: నా రీ ఎంట్రీకి ప్రధాన కారణం అదే: పుజారా

Published Thu, Jun 23 2022 3:39 PM | Last Updated on Thu, Jun 23 2022 4:06 PM

Cheteshwar Pujara opens up about his Team India comeback - Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన నయావాల్‌ రంజీ ట్రోఫీ, ఇంగ్లండ్‌ కౌంటీల్లో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరగబోయే ఏకైక టెస్టుకు పుజారాను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తిరిగి జట్టులోకి రావడంపై అతడు తాజాగా స్పందించాడు. రంజీ ట్రోఫీలో ఆడడం వల్ల తిరిగి తన ఫామ్‌లోకి వచ్చానని తెలిపాడు.

"నేను ససెక్స్‌ జట్టులో చేరడానికి ముందు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో కలిసొచ్చింది. రంజీ ట్రోఫీలో నేను సౌరాష్ట్ర తరపున ఆడిన మూడు మ్యాచ్‌లలోను రాణించాను. అక్కడే తిరిగి నా రిథమ్‌ను పొందాను. రంజీ ట్రోఫీలో నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నాను.

ఇక నా ఫామ్‌ను తిరిగి పొందాక, జట్టులో విజయంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకున్నాను. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ను ఆడటానికి ఎక్కువగా ఇష్టపడాతాను. ఇక పై నాకు  దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాడానికి ప్రయత్నిస్తాను" అని బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు.
చదవండి: SL vs AUS: కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement