జోహెన్స్‌బర్గ్ వేదికగా జరగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా నయావాల్ ఛతేశ్వేర పుజారా అర్ధసెంచరీ సాధించాడు. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న పుజారాకి ఈ అర్ధ సెంచరీ కాస్త ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో మూడోరోజు ఆట అనంతరం మాట్లాడిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకపోయినా ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన జట్టు మేనేజ్‌మెంట్‌కు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు.
గత ఏడాదిగా తనపై వస్తున్న విమర్శలు గురించి పెద్దగా పట్టించుకోలేదని పుజారా చెప్పాడు. "టీమ్ మేనేజ్‌మెంట్ నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది, కాబట్టి బయట నాపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. కోచింగ్ స్టాఫ్, కెప్టెన్, ఆటగాళ్లందరూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. మేము కష్టపడి ఆడుతాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పరుగులు చేయలేం. అటువంటి సమయంలో మాపై విమర్శలు రావడం సాధారణం. కానీ ఒక క్రికెటర్‌గా ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకు పోవాలి" అని పుజారా పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 86 బంతులు ఎదుర్కొన్న పుజారా 53 పరుగులు చేశాడు.
చదవండి: సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా?
Comments
Please login to add a commentAdd a comment