
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు ఛతేశ్వర్ పుజారా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన టెస్టు కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని పుజారా సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతులు ఎదుర్కొన్న పుజారా 102 పరుగులు చేశాడు.
ఇక దూకుడుగా ఆడుతున్న పుజరాను ఐపీఎల్‌లో చూడాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. పుజరాకు టీ20 ఫార్మాట్ సెట్ కాదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
"నిజం చెప్పాలంటే పుజరాకు ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి ఉండేది. అతడు చాలా కాలం పాటు ప్రయత్నించాడు. అయితే టీ20 పార్మాట్ తనకు సెట్ కాదని గ్రహించాడు. అతడు ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతాడు. పుజరా తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటాడు. పుజరా తాను ఎంటో నిరూపించుకోవడానికి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడటలేదు.
ఏ ఫార్మాట్లో ఆడితే బాగుంటుందో అతడికి స్టృషంగా తెలుసు. ఐపీఎల్ అనేది పుజరా లాంటి వారికి సరిపోదని నేను భావిస్తున్నాను. ఇప్పటికే పుజరాకు కుడా ఈ విషయం అర్థమై ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా పుజారా చివరగా ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
అయితే ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ పుజారాకు అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతడిని విడిచిపెట్టింది. అయితే ఐపీఎల్- 2022 మెగా వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ అతడిని కోనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్-2023 మినీ వేలంలో పుజారా తన పేరును నమోదు చేసుకున్నాడు.
చదవండి: FIFA World Cup Qatar 2022 Second Final : మెస్సీ VS ఫ్రాన్స్