
Rahul Dravid Gesture Towards Pujara: టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డక్ అయిన సంగతి తెలిసిందే. తన పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఎన్గిడి బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారాపై ట్రోల్స్ వర్షం మొదలైంది. పుజారను పక్కనబెట్టి శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలా పుజారా డకౌట్‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వక్తమవుతున్న వేళ టీమిండియా హెడ్‌కోచ్ ద్రవిడ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.
చదవండి: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో!
మ్యాచ్‌లో ఔటైన తర్వాత డగౌట్‌కు చేరిన పుజారా కాసేపటి తర్వాత బయటికి వచ్చి బుమ్రా, ప్రియాంక్ పాంచల్ పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో ద్రవిడ్ లేచి డ్రెస్సింరూమ్‌కు వెళుతున్నాడు. ఇద్దరు ఎదురెదురు పడడంతో ద్రవిడ్... ''ఏం పర్లేదు'' అన్నట్లుగా తన చేతిని పుజారా భుజంపై తట్టడం కెమెరాలో రికార్డయింది. దీనికి రియాక్షన్‌గా పుజారా ఒక నవ్వు మొహం పెట్టడం ఆసక్తి కలిగించింది. ఈ చర్యను చూసిన చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు.
పుజారా బ్యాటింగ్‌పై తనకు నమ్మకముందని ద్రవిడ్ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియాలో సమావేశంలో పేర్కొన్నాడు. బహుశా ఆ నమ్మకంతోనే అతని బ్యాటింగ్ తీరుపై పుజారాను తిట్టకుండా వెన్నుతట్టి దైర్యం చెప్పాడంటూ పలువురు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ద్రవిడ్ చర్యపై కొందరు మాత్రం ప్రశంసలు గుప్పించారు.'' పుజారాతో వ్యవహరించిన తీరు ద్రవిడ్‌కు మాత్రమే చెల్లుతుందని.. ఎంతైనా కోచ్ కదా''..'' అందరి కోచ్‌ల్లోకెల్లా ద్రవిడ్ భిన్నంగా కనిపిస్తాడనేదానికి ఇదే ఉదాహరణ'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్
#SAvIND pic.twitter.com/SpMO6RtccL
— Ashwin Natarajan (@ash_natarajan) December 26, 2021