సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా డిసెంబర్ 26 నుంచి(బాక్సింగ్ డే) తొలి టెస్టు ఆడనుంది. ఇప్పటికే ప్రాక్టీస్‌లో జోరు పెంచిన టీమిండియా సిరీస్‌ను విజయంతో ఆరంభించాలన్న దృడ సంకల్పంతో ఉంది.కాగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం శనివారం మీడియాతో వర్చువల్ కాన్ఫరెన్స్‌తో మాట్లాడాడు. తొలి టెస్టుకు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలు బెంచ్‌కే పరిమితం కానున్నారంటూ వార్త్లలు వచ్చాయి. తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ద్రవిడ్‌కు ఎదురైంది. అయితే వీటన్నింటికి ద్రవిడ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
చదవండి: Ind Vs Sa Test Series: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా..
''వాళ్లంతా ప్రొఫెషనల్ క్రికెటర్లు. తుది జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీయాలనేది మాకు సమస్యే. కానీ జట్టులో 11 మంది మాత్రమే ఆడాలనే రూల్ ఉండడంతో ఎవరో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ విషయం మా ఆటగాళ్లు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. ప్రొటీస్‌తో తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందనే దానిపై మాకు క్లారిటీ ఉంది. కానీ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను రివీల్ చేయడం ఇష్టం లేదు. అలా చేస్తే ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.'' అని చెప్పుకొచ్చాడు.
ఇక కీలకమైన ఐదో స్థానంలో రహానే, విహారీ, అయ్యర్‌లలో ఎవరిని చూడొచ్చు అన్న ప్రశ్నకు ద్రవిడ్ మాట్లాడుతూ.. ''బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇప్పటికే అందరు ప్లేయర్స్‌తో చర్చించా. ముఖ్యంగా పుజారా, రహానేల బ్యాటింగ్ ఆర్డర్‌పై వారితో చాలాసేపు మాట్లాడా. కానీ తొలి టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు వస్తారనేది ఇప్పుడు చెప్పను.'' అని తెలిపాడు. అయితే సమావేశం చివర్లో..'' ఈ వారం రహానేకు మంచి ప్రాక్టీస్ దొరికింది'' అంటూ ద్రవిడ్ చెప్పడం చూస్తే పరోక్షంగా రహానే తుది జట్టులో ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడంటూ క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చదవండి: IRE Vs USA Cancelled: అంపైర్లు లేరు.. వన్డే మ్యాచ్ రద్దు
💬 💬 We've got some good quality practice over the week.
— BCCI (@BCCI) December 25, 2021
Head Coach Rahul Dravid speaks about the #TeamIndia's preparation in the lead up to the first #SAvIND Test. pic.twitter.com/bCjXbveV0I
Comments
Please login to add a commentAdd a comment