టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా ఎండార్స్‌మెంట్లతో ఎడాపెడా సంపాదిస్తుంటే.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. పుజారా అడ్వర్టైజ్ ఏజెన్సీలను ఆకర్షించలేకపోతున్నాడు. అయితే ఈ విషయం గురించి తాను ఏనాడు చింతించలేదని , దేశం కోసం ఆడటం మాత్రమే తనకు ముఖ్యమని పుజారా పేర్కొన్నాడు.
బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కారణంగా పెద్దగా ఎండార్స్‌మెంట్ ఆఫర్లు రావన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదించడం మాత్రమే నాకు తెలుసు. స్వప్రయోజనాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మాత్రమే ఆడాలని మా నాన్న చెప్పారు. ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించడం కంటే కూడా భారత్ తరఫున ఆడటమే గొప్పగా భావిస్తాను’ అని పుజారా వ్యాఖ్యానించాడు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. ఇక ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి మూడు సెంచరీలు సాధించిన పుజారా 521 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment