
జైపూర్ : టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్ వేడుకల కోసం అజారుద్దీన్ బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. కారు డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment