సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో.. ఆనం పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆనం- అసద్‌లు డిసెంబరు 11న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనం తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఒకే ఒక్కసారి జీవితం నీకు అద్భుత క్షణాలను అందిస్తుంది. ఇవి మా ఆనంద క్షణాలు. మా పెళ్లి వీడియో ఇది’ అని క్యాప్షన్ జత చేశారు.
ఇక ఇందులో ఆనం- అసద్‌లతో పాటు సానియా, ఆమె కుమారుడు ఇజహాన్, వరుడి తండ్రి అజారుద్దీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనం తల్లిదండ్రులు, సానియా, అజహరుద్దీన్ చిన్న చిన్న ఇంటర్వ్యూలతో పాటు వధూవరుల మధుర క్షణాలను ఫొటోగ్రాఫర్ కెమెరాలో బంధించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అప్పగింతల కార్యక్రమంలో.. ‘ ఆనం- అసద్‌లు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చారు. ఇప్పుడు నేను, అమ్మా, నాన్నా.. ముఖ్యంగా ఇజ్జూ నిన్ను చాలా మిస్సవుతాం ఆనం’ అంటూ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఆనంకు 2015లో హైదరాబాద్‌కే చెందిన ఓ బిజినెస్‌మన్‌తో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీర్దిదరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment