రవీంద్ర జడేజా
న్యూఢిల్లీ : ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి ఏడోసారి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడని అజారుద్దీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కీలక సమయంలో జడేజా(23;33 బంతుల్లో) భువనేశ్వర్(21;31 బంతుల్లో) తో కలిసి ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఈ టోర్నీలో అటు బంతి, ఇటు బ్యాట్‌తో మెరిసిన జడేజాను జట్టులో కొనసాగించాలని అజారుద్దీన్ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.
‘రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయవద్దు. ఆసియాకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో జడేజా త్వరగా పెవిలియన్ చేరుంటే.. భారత్ మ్యాచే నెగ్గేది కాదు. అతను భారత జట్టు 11 మంది సభ్యుల్లో ఎప్పుడు ఒకడే.’ అని తెలిపాడు. సూపర్-4లో బంగ్లాదేశ్‌పైనే జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే. (మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు: రోహిత్)
ఇక చివర్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్న జాదవ్ బ్యాటింగ్ చేయడాన్ని కూడా అజారుద్దీన్ కొనియాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసించాడు. అతను చాలా కూల్‌గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ మొర్తజా చెప్పినట్టే ఆ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో 6 పరుగుల అవసరం కాగా.. గాయంతోనే జాదవ్, కుల్దీప్ సాయంతో మ్యాచ్‌ను గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment