
దుబాయ్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో కుప్పకూలిన అతను టోర్నీనుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పాండ్యా స్థానంలో పేసర్ దీపక్ చహర్‌ను ఎంపిక చేశారు. మరో వైపు పాక్‌తో పోరులో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ కూడా టోర్నీకి దూరం కాగా, అతని స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు.
మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో అతడిని కూడా స్వదేశం పంపిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు... మరో పేసర్ సిద్ధార్థ్ కౌల్‌ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు గురువారం భారత జట్టుతో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment