దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలు దెబ్బతీశారు. వరుస ఓవర్లలో ఓపెనర్లు లిటన్ దాస్(7), నజ్ముల్ (7)లను పెవిలియన్ చేర్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్‌లు ఆచితూచి ఆడుతూ బంగ్లాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ జడేజా షకీబ్ అల్ హసన్(17) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. మరికొద్ది సేపటికే మిథున్ (9), క్రీజులో కుదురుకున్న ముష్పికర్ రహీమ్(21)లను సైతం జడేజానే ఔట్ చేయడంతో బంగ్లా 65కే 5 కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment