దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 174 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. చాలా కాలం తర్వాత భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా (4/29) బంతితో మెరిసాడు. జడ్డు మాయాజాలానికి, భువనేశ్వర్ (3/32), బుమ్రా (3/37)ల పేస్ తోడవ్వడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ మెహిదీ హసన్ మిర్జా(42), మొర్తజా(26), మహ్మదుల్లా(25), ముష్ఫికర్ రహ్మాన్(21)లవే టాప్ స్కోర్ కావడం విశేషం.
అంతకు మందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను భువీ, బుమ్రాలు దెబ్బతీశారు. వరుస ఓవర్లలో ఓపెనర్లు లిటన్ దాస్(7), నజ్ముల్లా హుస్సెస్ (7)లను పెవిలియన్ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్‌లు ఆచితూచి ఆడుతూ బంగ్లాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ జడేజా షకీబ్ అల్ హసన్(17) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. మరికొద్ది సేపటికే మిథున్ (9), క్రీజులో కుదురుకున్న ముష్పికర్ రహీమ్‌లను సైతం జడేజా ఔట్ చేయడంతో బంగ్లా 65కే 5 కీలక వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.
మెహ్‌దీ హసన్ ఒంటరి పోరాటం..
ఒకవైపు వికెట్లు కోల్పోతున్న మెహ్‌ది హసన్ ఒంటి పోరాటం చేశాడు. దీంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మొర్తజా, హసన్‌లు కొంత భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు భువవేశ్వర్ మొర్తజాను ఔట్ చేయగా.. మెహదీ హసన్(42), ముస్తాఫిజుర్ రహ్మన్(3)లను బుమ్రా పెవిలియన్ చేర్చడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment