హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల పరంపర కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో విజయంతో మరో ఘనత అతడి ఖాతాలో చేరింది. మహ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ గా కోహ్లి 15వ విజయం సాధించడంతో ఈ రికార్డు తన పేరిట చేరింది. ఎంఎస్ ధోని, గంగూలీ తర్వాత విజయవంతమైన మూడో భారత కెప్టెన్ గా అతడు నిలిచాడు.
కోహ్లి వరల్డ్ సెకండ్ బెస్ట్
కోహ్లి ఇప్పటివరకు 23 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ 23 మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకుంటే భారత కెప్టెన్లలో కోహ్లి ఉత్తమ నాయకుడిగా ఖ్యాతికెక్కాడు. ఓవరాల్ గా సెకండ్ బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. స్టీవ్ వా ముందున్నాడు. 23 టెస్టుల్లో అతడు 15 విజయాలు అందించాడు. రెండిటిలో టీమిండియా ఓడింది. 6 డ్రా అయ్యాయి. స్టీవ్ వా 17 విజయాలు విజయాలు అందించాడు.