'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు' | Mohammad Azharuddin reacts his nomination for HCA President rejected | Sakshi
Sakshi News home page

'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'

Published Sat, Jan 14 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM

'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'

'మొదటి నుంచి నాకు వ్యతిరేకంగా కుట్రలు'

హైదరాబాద్‌ : హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్‌ తిరస్కరించడంపై మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పందించారు.  మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం అజహర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ  రిటర్నింగ్‌ అధికారి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు.

చదవండి...(అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ)

తన నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదన్న ఆయన... కేబినెట్‌ ర్యాంక్‌ పదవిలో కొనసాగుతున్న వివేక్‌ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. కార్యదర్శి పదవి విషయంలోనూ నిబంధనలు పక్కనపెట్టారని, లోథా కమిటీ నియమాలు మిగతా వారికి వర్తించవా అంటూ ప్రశ్నలు సంధించారు. క్రికెట్‌ కు మంచి చేయాలనే తాను నామినేషన్‌ వేసినట్లు పేర్కొన్నారు. తన నామినేషన్‌ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అజహర్‌ తెలిపారు. కాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్‌ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement