సాక్షి, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి బలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. ఇవాళ(బుధవారం) నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీతో పరిస్థితి వేడెక్కింది.
అజారుద్దీన్ ఇవాళ రెహమత్ నగర్‌లో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం అందించకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఇదే నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోరాదాబాద్(యూపీ) నుంచి ఎంపీగా నెగ్గారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment