
హైదరాబాద్: ప్రముఖ మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ను కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని కోరామన్నారు. కలిసికట్టుగా పోరాడితే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయనకు చెప్పామన్నారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఏదైనా సరే.. అవకాశమిస్తామని ఆయనకు చెప్పామన్నారు. తెలంగాణలో పోటీ చేసేందుకు అజహరుద్దీన్ అంగీకరిస్తే, ఆయనతో పార్టీ తరపున ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన అజహర్ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం విదితమే. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.