సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజహరుద్దీన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలని సూపర్‌వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (రిటైర్డ్) ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు తన నివేదిక అందించారు.
దీని ప్రకారం కార్యదర్శి విజయానంద్ పదవితో పాటు అడ్‌హాక్ కమిటీ కూడా రద్దయినట్లే. సెప్టెంబర్ 30తోనే అజహర్ పదవీకాలం ముగిసిందని, ఆపై ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి విలువా లేదని కక్రూ పేర్కొన్నారు. ఆయన నివేదిక ప్రకారం సెలక్టర్లు, కోచ్‌ల ఎంపిక, ఇతర నియామకాలేవీ చెల్లవు. సూపర్‌వైజరీ కమిటీ పర్యవేక్షణలోనే కొత్త సెలక్టర్లను కూడా ఎంపిక చేయాలని కక్రూ సూచించారు.
చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment