
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌కు టెస్టు క్రికెట్ హోదా ఇవ్వడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గాన్‌కు అప్పుడే టెస్టు హోదా ఇవ్వడం తొందరపాటు చర్యగా అజహర్ విశ్లేషించాడు. ఆ జట్టుకు టెస్టు హోదా ఇచ్చి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తప్పు చేసిందన్నాడు.
‘జట్టు విషయానికొస్తే అఫ్గానిస్తాన్ మంచి జట్టే. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు, టెస్టులకు చాలా తేడా ఉంటుంది. అఫ్గాన్‌కు టెస్టు హోదా ఇచ్చి ఐసీసీ తొందరపడింది. వాళ్లకి ఇంకాస్త ఎక్కువ సమయం ఇచ్చి ఉండాల్సింది. భారత్‌తో ఆ జట్టు ఆడిన తొలి టెస్టే రెండు రోజుల్లో ముగిసిపోవడం వాళ్లని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాళ్లు భవిష్యత్తులో చాలా టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమలోని లోపాలను అధిగమించడానికి ఈ టెస్టు వాళ్లకి ఓ పాఠం లాంటిది. టెస్టు ఫార్మాట్ కోసం వాళ్లు ఆటలో మరింత పురోగతి సాధించాలి’ అని అజహర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment