
సాక్షి, హైదరాబాద్ : తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం ఈ మాజీ క్రికెటర్ కారెక్కడానికి సిద్దమయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో అజార్ ట్విటర్‌లో స్పందిస్తూ.. తాను టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు.
ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్‌ఎస్ కీలక నేతలతో అజార్ చర్చలు జరిపినట్టు, ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. సంక్రాంతి తర్వాత టీఆర్‌ఎస్‌లో అజారుద్దీన్ అధికారికంగా చేరుతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. తాజాగా అజార్ దీన్ని ఖండించడంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లైంది.
The news doing the rounds in the media of me joining the TRS party in Telangana is incorrect & false.
— Mohammed Azharuddin (@azharflicks) January 2, 2019
Comments
Please login to add a commentAdd a comment