న్యూఢిల్లీ: ఎప్పుడు ఎదో వివాదాస్పద అంశంతో నిత్యం వార్తల్లో ఉండే భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేశాడు. విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన చర్చలో హర్భజన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మొదటి టెస్ట్‌ను ఆస్ట్రేలియాతో అరంగేట్రం చేశానని గుర్తుచేశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయిన ఆటగాళ్లందరు ఆంగ్లంలో మాట్లాడుతుండగా తనకేమి అర్థం కాలేదని అన్నాడు. తనను సైతం ఆంగ్లంలో మాట్లాడమని సూచించగా తనకు ఆంగ్లం రాదని వారికి తెలిపినట్టు వెల్లడించాడు.
అప్పటి కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తన ఇబ్బందిని గుర్తించి తన మాతృ భాష పంజాబీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారని చెప్పాడు. భారత్ తరుపున హర్భజన్ 103 టెస్ట్‌లు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. కాగా టెస్ట్‌లలో 417వికెట్లు, వన్డేలలో 269 వికెట్లు, టీ20లలో 25వికెట్లు పడగొట్టాడు. అయితే 2007లో టీ20ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో హర్భజన్ సభ్యుడిగా ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment