
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఆనందం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌పై 125 పరుగులు తేడాతో విజయం సాధించిన తర్వాత మాట్లాడిన అజహర్.. ఈ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. ఇదే జోరును జూలై 14వ తేదీ(ఫైనల్ జరిగే రోజు) వరకూ కొనసాగించాలన్నాడు. ‘ వరల్డ్‌కప్ ఫైనల్ వరకూ భారత్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాల్ని సాధించడం శుభ పరిణామం. ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. దాంతో వరల్డ్‌కప్‌ను భారత్ సాధిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. భారత్ కచ్చితంగా వరల్డ్‌కప్‌తో తిరిగి వస్తుంది’ అని అజహర్ పేర్కొన్నాడు.
ఇక హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్ గెలిచే సత్తా లేదన్నాడు. ప్రస్తుత తరుణంలో ఆ జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ వరకూ వెళ్లడం చాలా కష్టమన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఆట అంత ఆశాజనంగా లేదన్నాడు. ఆ జట్టు కనీంస సెమీస్ చేరుతుందని తాను కోవడం లేదన్నాడు. ‘ ఇంగ్లండ్ గొప్ప జట్టే.. కానీ ఆ జట్టు పూర్తి స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఇంగ్లండ్ చాలా ఒత్తిడిలో ఉంది. దాంతో సెమీస్‌కు చేరడం చాలా కష్టం. ఇంగ్లండ్ టాప్-4లోఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని అజహర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment