న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన అనంతరం ఆసియా కప్‌కు గైర్హాజరీ అయిన విరాట్ కోహ్లి వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలోనే విండీస్‌పై టెస్టుల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ చేసిన 539 పరుగుల రికార్డుకు కోహ్లి 37 పరుగుల దూరంలో నిలిచాడు. మరో రెండు రోజుల్లో విండీస్ ఆరంభయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో అజహరుద్దీన్ పరుగుల రికార్డును కోహ్లి అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ వెస్టిండీస్‌తో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 502 పరుగులు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 38.61 సగుటుతో ఈ పరుగులు సాధించాడు. విండీస్‌పై కోహ్లి చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 200.
కాగా, వెస్టిండీస్‌పై అత్యధికంగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ (2746) అగ్రస్థానంలో ఉన్నాడు. గావస్కర్ తర్వాత రాహుల్ ద్రవిడ్ (1978), వీవీఎస్ లక్ష్మణ్ (1715)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే, 1948 నుంచి భారత్-విండీస్ జట్ల మధ్య 94 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 28 మ్యాచ్‌లు గెలవగా, 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment