కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్‌ | Navjot Singh Sidhu, Azharuddin to be Congress' star campaigners in Chhattisgarh | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్‌

Published Thu, Oct 18 2018 3:55 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Navjot Singh Sidhu, Azharuddin to be Congress' star campaigners in Chhattisgarh - Sakshi

మహ్మద్‌ అజహరుద్దీన్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

రాయ్‌పూర్‌: రాజకీయ నేతలుగా మారిన మాజీ క్రికెటర్లు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, మహ్మద్‌ అజహరుద్దీన్‌లు ఛత్తీస్‌గఢ్‌ తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ గెహ్లాట్, సుశీల్‌ కుమార్‌ షిండే, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, గులాం నబీ ఆజాద్, రాజ్‌ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులున్నారని ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లుండగా, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్‌ ప్రతిపక్షానికే పరిమితమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement