లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఇక్కడ ఎన్నికల కోసం ఏకంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ కేంద్ర, రాష్ట్ర నాయకులు, మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు పార్టీ కోసం ర్యాలీలు, బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
జాబితాలో ఉన్నది వీళ్లే..
ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఎమ్మెల్యే ఆరాధన మిశ్రా, రాష్ట్ర మాజీ స్పీకర్ సల్మాన్ ఖుర్షీద్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు.
అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రసంగించనున్నారు.
వీరితోపాటు రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ, రాజీవ్ శుక్లా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, దీపేంద్ర సింగ్ హుడా, రంజిత్ రంజన్, ప్రదీప్ జైన్ ఆదిత్య, నిర్మల్ ఖత్రీ, రాజ్ బబ్బర్, బ్రిజ్‌లాల్ ఖబ్రీ, అజయ్ కుమార్ లల్లు, పీఎల్ పునియా, ఇమ్రాన్ మసూద్, మీమ్ అఫ్జూద్ నదీమ్ జావేద్, సుప్రియా సింగ్, ధీరజ్ గుర్జార్, ప్రదీప్ నర్వాల్, తౌకీర్ ఆలం, రాజేష్ తివారీ, సత్యన్నారాయణ పటేల్, నీలాన్షు చతుర్వేది, అల్కా లాంబా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment