ఒకవేళ నేను కెప్టెన్గా ఉండుంటే..! | I would definitely make Ashwin and Jadeja play in the Australia series | Sakshi
Sakshi News home page

ఒకవేళ నేను కెప్టెన్గా ఉండుంటే..!

Published Tue, Sep 12 2017 12:22 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

ఒకవేళ నేను కెప్టెన్గా ఉండుంటే..!

ఒకవేళ నేను కెప్టెన్గా ఉండుంటే..!

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి టీమిండియా సెలక్షన్ సరిగా లేదంటూ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి టీమిండియా సెలక్షన్ సరిగా లేదంటూ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన దేశంతో క్రికెట్ ఆడేటప్పుడు జట్టును ఎంపిక చేయడం ఇలాగేనా అంటూ అజహర్ ప్రశ్నించారు. ప్రధానంగా భారత అగ్రశ్రేణి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆసీస్ తో సిరీస్ కు ఎంపిక చేయకపోవడానికి కారణమేమిటని నిలదీశారు.

 

' మీరు(సెలక్టర్లు) ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సిరీస్ జరిగేది ఆసీస్తో అనే విషయం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అత్యుత్తమ జట్టుతో్ జరిగే సిరీస్ కు ఇదేనా ఎంపిక. ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకమైనది. శ్రీలంకతో సిరీస్ కు అశ్విన్, జడేజాలకు విశ్రాంతినివ్వడాన్ని నేను అర్దం చేసుకోగలను. మరి ఆసీస్ తో సిరీస్ కు కూడా ఆ ఇద్దరి అవసరం లేదా. మన అత్యుత్తమ స్పిన్నర్లను పటిష్టమైన ఆసీస్ పై ఉపయోగించుకోవాలి.  అందులోనూ స్వదేశంలో వికెట్ అశ్విన్, జడేజాల బౌలింగ్ శైలికి బాగా సెట్ అవుతుంది. ఆసీస్ తో సిరీస్ కు వారిని ఆడించాల్సింది. ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్ ల్లో అశ్విన్ ఆడటం తప్పులేదు. అతని ఆత్మవిశ్వాసం పెరగడానికి  కౌంటీలు బాగా ఉపయోగపడతాయనే విషయం నాకు తెలుసు. అదే సమయంలో ఆసీస్ తో సిరీస్ కూడా ముఖ్యమనే విషయం గ్రహించాలి. ఒకవేళ ఆసీస్ తో సిరీస్ కు నేను కెప్టెన్ గా ఉన్నట్లయితే అశ్విన్, జడేజాలను కచ్చితంగా ఆడించేవాడిని' అని అజహర్ అభిప్రాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement