అజారుద్దీన్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు | HCA elections: seshu narayana condemns Azharuddin comments | Sakshi
Sakshi News home page

అజారుద్దీన్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు

Published Sun, Jan 15 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

అజారుద్దీన్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు

అజారుద్దీన్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌పై అజరుద్దీన్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హెచ్‌సీఏ నూతన కార్యదర్శి శేషు నారాయణ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ తన నామినేషన్‌ తిరస్కరించారన్న ఆక్రోశంతోనే అజహర్‌ మాట్లాడుతున్నారన్నారు. వివేక్‌పై అజహర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అలాగే వివేక్‌కు అనర్హత వర్తించదని శేషు నారాయణ పేర్కొన్నారు.

కాగా హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి అజహర్‌ వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. జీవిత కాల నిషేధంపై అజహర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ  ప్రభుత్వ సలహాదారు వివేక్‌, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్‌ తిరస్కరణపై అజహర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement