శనివారం పార్క్‌హయత్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అజారుద్దీన్, సానియామీర్జా, అసదుద్దీన్, ఆనమ్ మీర్జా
‘మా పరిచయం హాయ్‌తో మొదలైంది. కొన్ని రోజులు అలాగే కంటిన్యూ అయింది. ఇక తర్వాత నేనే డేర్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పాను. ఆనమ్ వెంటనే యాక్సెప్ట్ చేసింది. నేను కీప్‌క్వైట్.. తనేమో హైపర్’ అంటూ చెప్పాడు అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్. క్రికెటర్ అయిన అసద్... టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనమ్‌మీర్జాతో ప్రేమలో ఉన్నాడు. డిసెంబర్‌లో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే వెల్లడించారు.
ప్రస్తుతం సిటీ అంతా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌ల వివాహం గురించే చర్చ నడుస్తోంది. ఈ జంట ఎప్పుడు ఒక్కటవుతుందంటూ సామాన్యుడి నుంచి స్పోర్ట్స్, కార్పొరేట్ దిగ్గజాల వరకు ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా కొనసాగుతున్న ఈ సందిగ్ధానికి తెర పడింది. ఆనమ్, అసదుద్దీన్‌ల షాదీ వచ్చే డిసెంబర్‌లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ది లేబుల్ బజార్ ఎక్స్‌పో సందర్భంగా మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.
– సాక్షి, సిటీబ్యూరో
ఆనమ్ మీర్జాకు 2016లో అక్బర్ రషీద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్లపాటు కలిసి ఉన్న వీరు 2018లో విడాకులు తీసుకున్నారు. మొదట నుంచి అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఆనమ్ మీర్జా, అసదుద్దీన్‌లు మంచి మిత్రులుగా మారారు. కొన్నాళ్ల తర్వాత ప్రేమ చిగురించింది.
19 ఏళ్ల సాన్నిహిత్యం..
అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాల మధ్య 19 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో అజారుద్దీన్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–1లో ‘ఈఎస్‌టీ’ పేరుతో జిమ్‌ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సానియా మీర్జా తన కెరీర్‌ని ప్రారంభించింది. అలా రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ ఉండేది. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఈ స్నేహ, సాన్నిహిత్యాలే తమ మధ్య ప్రేమ చిగురించడానికి కారణమని అసదుద్దీన్ వివరించారు.
హాయ్‌తో మొదలైన పలకరింపులు
‘మొదట్లో హాయ్.. అంటూ ఇద్దరం పలకరించుకునేవాళ్లం’ ఆ తర్వాత నేనే డేర్ చేసి ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేశా. వెంటనే షీ యాక్సెప్టెడ్. అలా మా ఇద్దరి లవ్‌కి వన్ ఇయర్ అవుతోంది. నేను చాలా క్వీప్‌క్వైట్. బట్ ఆనమ్ మీర్జా అలా కాదు ‘షీ ఈజ్ హైపర్’ (నవ్వుతూ). ఆమె అలా ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే ఆమె పెద్ద డిజైనర్ ‘లేబుల్‌బజార్’ లాంటి ఎక్స్‌పోలు చేస్తోంది. ఇన్నోసెంట్‌గా ఉంటే కష్టం కాబట్టి తను హైపర్ (నవ్వుతూ) అని అసదుద్దీన్ తెలిపారు.
షాపింగ్ కోలాహలం..
ఆనమ్, అసద్ ప్రేమలో ఉన్నప్పటి నుంచే వీరి వివాహం కోసం అజారుద్దీన్, సానియా మీర్జాలు సన్నాహాలు ప్రారంభించారు. ఇరు కుటుంబాల వారు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చాక పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. రానున్న డిసెంబర్‌లో హైదరాబాద్ సిటీలోనే షాదీ జరగనుంది. పెళ్లికి ఇప్పటి నుంచే షాపింగ్ ప్రారంభించారు.
ఆనమ్, అసదుద్దీన్‌ల నేపథ్యం ఇదీ..
అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా క్రికెటరే. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్’ (హెచ్‌సీఏ) రంజీ ఆడేందుకు అవకాశం లభించలేదు. దీంతో గత ఏడాది గోవాలో జరిగిన రంజీ(ఫస్ట్‌క్లాస్ డెబ్యూ)లో అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహించాడు. అసదుద్దీన్‌కు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు ఉంది. గత ఏడాది ఐపీఎల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. టీంలో చోటు దక్కలేదు. ఇక ఆనమ్ మీర్జా విషయానికి వస్తే.. ఆమె ఫ్యాషన్ డిజైనర్. సిటీలోని టాప్‌మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్లలో ఆనమ్ మీర్జా ఒకరు. ప్రతి ఏటా ‘ది లేబుల్ బజార్’ పేరుతో అతిపెద్ద ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది.
హైలెవల్ బజార్
వందకుపైగా స్టాళ్లలో ప్రఖ్యాతిగాంచిన దుస్తులు. కళ్లు జిగేల్‌మనిపించే జ్యువెలరీ, గాగూల్స్ కొలువుదీరాయి. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ‘ది లేబుల్ బజార్ సీజన్–11’లో ఆకట్టుకుంటున్నాయి. మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో కలిసి ప్రముఖ టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా, అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment