ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
►జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(110 బంతుల్లో 76 నాటౌట్), శుబ్‌మన్ గిల్( 70 బంతుల్లో 81 నాటౌట్).. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపులు మెరిపించారు.
విజయం దిశగా టీమిండియా..
►జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 27 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 160 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 72, శిఖర్ ధావన్ 66 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ధావన్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 104/0
►జింబాబ్వేతో తొలి వన్డేలో ధావన్ అర్థసెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వస్తున్న ధావన్ 76 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకున్నాడు. ధావన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ధావన్‌కు గిల్ 36 పరుగులతో సహకరిస్తున్నాడు.
అర్థశతకానికి చేరువలో శిఖర్ ధావన్.. టీమిండియా 91/0
►జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 45 పరుగులతో అర్థశతకానికి చేరువ కాగా.. గిల్ 31 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా విజయానికి 99 పరుగులు చేయాల్సి ఉంది.
నిలకడగా ఆడుతున్న టీమిండియా.. 8 ఓవర్లలో స్కోరెంతంటే?
►జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి వికెట నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ధావన్ 19, శుబ్‌మన్ గిల్ 5 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 190.. 3 ఓవర్లలో టీమిండియా 19/0
►190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ధావన్ 11, శుబ్‌మన్ గిల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
జింబాబ్వే 189 ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 190
►టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చకాబ్వా 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం 150 పరుగుల మార్క్‌నైనా దాటుతుందా అన్న అనుమానం వచ్చింది. కానీ చివర్లో రిచర్డ్ నగర్వా 34, బ్రాడ్ ఎవన్స్ 33 పరుగులు నాటౌట్ ఆకట్టుకోవడంతో ఆ జట్టు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీయగా,.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
38 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 171/8
►38 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. క్రీజులో రిచర్డ్ నగరవా 27, బ్రాడ్ ఎవన్స్ 30 పరుగులతో ఉన్నారు.
ఆలౌట్ దిశగా జింబాబ్వే..
►టీమిండియాతో తొలి వన్డేలో జింబాబ్వే ఆలౌట్ దిశగా పయనిస్తోంది. తాజాగా 13 పరుగులు చేసిన జాంగ్వే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే 30 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. రిచర్డ్ నగరవా 3, బ్రాడ్ ఎవన్స్ 2 పరుగులతో ఆడుతున్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే
►107 పరుగుల వద్ద జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన చకాబ్వా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 27 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 107/7
24 ఓవర్లలో జింబాబ్వే 91/6
►24 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో చకాబ్వా 21, లూక్ జాంగ్వే(1) పరుగులతో ఉన్నారు.
16 ఓవర్లలో జింబాబ్వే 66/4
►16 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. చకాబ్వా 21, సికిందర్ రజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
12 ఓవర్లలో జింబాబ్వే 42/4
►12 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. కెప్టెన్ చకబ్వా 14, సికందర్ రజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే..
►టీమిండియాతో తొలి వన్డేలో జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఒక్క పరుగు మాత్రమే చేసిన సీన్ విలియమ్స్ సిరాజ్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు మరుమని(8) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ నష్టపోయింది. దీపక్ చహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..
►టీమిండియాతో మ్యాచ్‌లో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చహర్ బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన కైయా కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. మరుమని 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
3 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 17/0
► 3 ఓవర్ల ఆట ముగిసేసరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఇన్నోసెంట్ కైయా 3, మరుమని 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. చహర్, సిరాజ్‌లు కలిపి ఏడు వైడ్లు సమర్పించుకున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
►వెస్టిండీస్‌తో సిరీస్‌ను విజయవంతగా ముగించుకున్న టీమిండియా తాజాగా జింబాబ్వేతో సిరీస్‌కు సన్నద్దమయింది. అయితే జట్టులోని సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇక హరారే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ నగరవ
Captain KL Rahul calls it right at the toss and we will bowl first in the 1st ODI.
A look at our Playing XI for the game.
Live - https://t.co/gVIUAMttDe #ZIMvIND pic.twitter.com/QEgpf7yIp0
— BCCI (@BCCI) August 18, 2022
► ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్‌లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’.
Comments
Please login to add a commentAdd a comment