ముంబై: కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ముంబైని వీడి ఎక్కడికో పయనమైంది. ఇందుకోసం ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ముందు జాగ్రత్త కొద్దీ రెండు ఫేస్ మాస్క్‌లు ధరించింది. అయితే ఆమె కారు దిగిన వెంటనే తన సామానులను హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. కానీ ఆ బ్యాగును మాత్రం ధరించలేదు. ఆమె అసిస్టెంటు ఆ బ్యాగు మోశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా పలువురు నెటిజన్లు ఆమె తీరును తప్పు పడుతున్నారు. 'తన బ్యాగును తనే మోసుకోలేకపోతుందా?', 'ఆ చిన్న బ్యాగుకు కూడా అసిస్టెంట్ సాయం కావాలా?' అని విమర్శిస్తున్నారు. 'ఎంత ఆటిట్యూడ్ నీకు.. బ్యాగ్ బరువైతుందా? అయినా నువ్వు చాలా తెలివైనదానివి.. టీవీలో ఆదర్శభావాలు చూపించే నువ్వు, వెబ్‌సిరీస్‌లో మాత్రం అసభ్యకరమైన కంటెంట్‌ను చూపిస్తావు' అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
కాగా ఈ నిర్మాత ఇటీవలే గోవాలో 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, దిశా పటానీ, అర్జున్ కపూర్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో 'హిస్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తోంది.
చదవండి: కార్తీ డబుల్ యాక్షన్ మూవీ: హీరోయిన్‌గా రాశీ ఖన్నా
Comments
Please login to add a commentAdd a comment