
‘నీ చిరునవ్వుతో మా జీవితాలను ప్రకాశింపజేశావు. ఎలాంటి యుద్ధం ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చావు. కాలమే గాయాల్ని మాన్పుతుందనే నీ మాటలు విపత్కర పరిస్థితుల్లో నాకెంతగానో ఊరటనిచ్చాయి. నీ గొప్పతనాన్ని వర్ణించేందుకు ఇరానీ కుటుంబానికి మాటలు సరిపోవు. హ్యాపీ బర్త్‌డే ఏక్తా. రాక్‌స్టార్ మాసీ’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ప్రాణ స్నేహితురాలు ఏక్తా కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏక్తా సోదరుడి కుమారుడు లక్ష్యా కపూర్‌తో ఉన్న ఆమె ఫొటోను షేర్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఏక్తా కపూర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా అక్కాచెల్లెళ్లలా కలిసి ఉండే మీరిద్దరి స్నేహం కలకాలం వర్థిల్లాలి అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కాగా ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా పలు వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్.. ‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నేడు ఆమె 44 వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఇక మోడల్‌గా కెరీర్ ఆరంభించిన స్మృతి ఇరానీ పలు టీవీ సీరియళ్లలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఏక్తా కపూర్ నిర్మించిన ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్‌తో లైమ్‌టైమ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన స్మృతి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్రమంత్రి అయ్యారు. ప్రధాన నరేంద్ర మోదీ కేబినెట్‌లో రెండుసార్లు చోటు దక్కించుకున్న ఆమె...ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మట్టికరిపించిన స్మృతి.. మోదీ 2.0 కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment