
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అనూహ్య మరణంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ‘ఎంస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతని ఆకస్మిక మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వారిలో సుశాంత్‌కు నటుడిగా తొలి అవకాశమిచ్చిన నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఉన్నారు. వారం రోజుల్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని, సుశాంత్ అంతటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని ఆమె ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. ‘ఇది సరైన నిర్ణయం కాదు సుశి. ఒక్క వారంలోనే అంతా మారిపోయింది. నాట్ ఫెయిర్ మై బేబీ!’అని ఏక్తా హృద్యంగా రాసుకొచ్చారు. సుశాంత్‌తో చివరగా చేసిన ఇన్‌స్టా పోస్టుల స్క్రీన్ షాట్ పెట్టి ఆమె నివాళి అర్పించారు. అయితే, వారంలో ఏం మారిందో ఆమె చెప్పలేదు.
(చదవండి: హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య)
కాగా, పవిత్ర రిస్తా టీవీ సీరియల్‌లో ఏక్తా కపూర్ సుశాంత్‌కు తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్‌కు లీడ్ రోల్ ఇవ్వడంపై జీటీవీ చానెల్ తొలుత ఒప్పుకోలేదట. చివరకు సదరు టీవీ చానెల్‌ను కన్విన్స్ చేసి సుశాంత్‌కు అవకాశమిచ్చామని రెండు వారాల క్రితం ఆమె ఇన్‌స్టాలో తెలిపారు. దీనిపై సుశాంత్ కూడా స్పందించాడు. తనకు అవకాశమిచ్చిన ఏక్తాకపూర్‌కు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని అతను పేర్కొన్నాడు. ఇక పవిత్ర రిస్తా సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్న సుశాంత్.. అనంతరం బాలీవుడ్‌కు పయనమయ్యాడు. ఏక్తా కపూర్ సోదరుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన కాయ్ పో చే సినిమాతో అతను వెండితెరకు పరిచమయ్యాడు.
(చదవండి: సోషల్ మీడియాలో సుశాంత్ చివరి పోస్ట్ ఇదే)
Comments
Please login to add a commentAdd a comment