
నగ్నంగా... నాకు ఓ.కె!
‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’... ప్రస్తుతం హిందీ రంగంలో గురించి ఈ చిత్రం గురించి మాట్లాడుకోనివాళ్లు లేరు. కెన్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పూర్వ కార్యక్రమాల సమయంలోనే వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఈ చిత్రం కోసం ఏక్తా ప్రవేశపెట్టిన ‘న్యూడిటీ క్లాజ్’. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారామె.కథానాయిక పాత్ర పోషించే తార ఈ న్యూడిటీ క్లాజ్‌లో సంతకం పెట్టాలన్న మాట.
ఈ పని ఎవరు చేస్తారా? అని హిందీ రంగంలో చాలామంది ఎదురుచూశారు. చివరికి మోడల్ కైరా దత్ దీనికి ఒప్పుకున్నారు. సన్నివేశాన్ని బట్టి అవసరమైతే నగ్నంగా నటిస్తానంటూ సంతకం పెట్టేశారు. ఇప్పటివరకూ మన తెరపై రానంత ‘హాట్ మూవీ’ ఇదని సమాచారం. పెద్దలకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రంలో శృంగారం పాళ్లు తారస్థాయిలో ఉంటాయట. తీరా చిత్రీకరణ మొదలుపెట్టాక, హాట్ సీన్స్‌లో నటించడానికి తారలు ససేమిరా అంటే! అందుకే ముందు జాగ్రత్తగా సంతకం పెట్టించుకున్నారు.
కానీ, కైరా మాత్రం ఈ చిత్రంలో నటించడం తన అదృష్టం అంటున్నారు. కత్తి లాంటి దేహాన్ని ప్రదర్శించే వీలుందని సంబరపడిపోతున్నారు. ఐదు కథల సమాహారంగా సాగే ఈ చిత్రంలో అన్ని కథల్లోనూ కైరానే నాయిక. ఓ మంచి దర్శకుడి చేతిలో పడ్డాననీ, నగ్న దృశ్యాలను ఆయన అద్భుతంగా చూపిస్తారనే నమ్మకం ఉందనీ ఆమె వ్యాఖ్యానించారు. కథానాయికలు ఎంతకాలం పక్కింటి అమ్మాయిలా కనిపించాలని కూడా అంటున్నారు.